మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్ 2 సినిమా షూటింగ్ మొదలు అయ్యింది.
వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!!
భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు..అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యం అవుతూ వచ్చింది..
ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ అయితే పూర్తి కాలేదు. మొదట ముంబైలో మొదలైన ఈ సినిమా షూటింగ్, అబుదాబి, లండన్ వంటి అంతర్జాతీయ లొకేషన్లలో కొనసాగింది. హాలీవుడ్ యాక్షన్ టీమ్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తుంది… అయితే ఈ సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు, రీషెడ్యూల్స్ కారణంగా ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది.ఎన్టీఆర్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెట్టి ఉండాల్సింది.. కానీ వార్ 2 పూర్తి కాకుండా ఆ సినిమా మొదలు పెట్టదానికి లేదు..కానీ, వార్ 2 లో తన షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు తీసుకోవడంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది.దీనితో తారక్ చిత్ర యూనిట్ పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.త్వరగా పూర్తిచేయాలనీ సూచించినట్లు సమాచారం.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..