MOVIE NEWS

హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.దాదాపు ఆరేళ్ళ తరువాత  సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.కానీ పాన్ ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ కు క్రేజ్ బాగా ఉండటంతో ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతము ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2 “..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం

పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..?

ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది ఆగస్టు 14 న రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే  ఈ సినిమా విడుదల కాకముందే ఎన్టీఆర్ మరో హిందీ సినిమాకు సంతకం చేశాడన్న న్యూస్ బాగా వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌తో ఎన్టీఆర్ మరో భారీ సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని బీటౌన్ సర్కిల్‌ లో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు చెప్పిన కథ ఎన్టీఆర్ కి నచ్చిందట. అన్నీ కుదిరితే 2025 చివరలో ఈ సినిమా లాంచ్ కాబోతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అధికారిక ప్రకటన రానుంది.అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరనేది సస్పెన్సుగా ఉంచుతున్నట్లు సమాచారం .

Related posts

సొంత కథతో రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందో..?

murali

ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!!

murali

Leave a Comment