మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించనున్నారు.గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దీనితో ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ పై భారీగా అంచనాలు వున్నాయి..ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు..
వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ పై.. కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!!
అయితే ఈ సినిమాకు సంబందించి బిగ్ అనౌన్స్మెంట్ చేయాలనీ నిర్మాత నాగవంశీ,దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఈ విషయమై నిర్మాత నాగావంశి మాట్లాడుతూ ‘ త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ముందు మేము ఒక స్కేల్ లో అనుకుని రిలీజ్ చేయాలని భావించాం. కానీ ఇటీవల బాలీవుడ్ నుండి వచ్చిన రామాయణ్ గ్లిమ్స్ వచ్చాక మా ప్లాన్స్ స్టాప్ చేసాము..
మా బ్యానర్ లో మా దర్శకులు త్రివిక్రమ్ గారు తొలిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు అంటే ఎలా ఉండాలి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా చుసిన నాకు జూనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా చూపించబోతున్నాను అనే ఆనందం నాకు చాలా ఉంటుంది కదా సో రామాయణ గ్లిమ్స్ గురించి ఇండియా అంతా ఎంతో గొప్పగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనం చేయబోయే సినిమా అంతకు మించి మాట్లాడుకోవాలి అనే కారణంగా త్రివిక్రమ్ కాస్త టైమ్ తీసుకుని అనౌన్సమెంట్ ఇద్దామనీ చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్య నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని ఆయన తెలిపారు.
