
NTR surges in to North Market with Devara : ఇప్పటి ట్రెండ్ ప్రకారం ప్రతి ఒక్క బడా హీరో పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు దానికి తగ్గట్టు నార్త్ మార్కెట్ ని కాప్చర్ చేయడం ఎంతైనా అవసరం
RRR తో ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవర ని కూడా నార్త్ లో రిలీజ్ కి ప్లాన్ చేసాడు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా ఒకటి రెండు రోజులు అక్కడ ఇంటర్వూస్ ఇచ్చి వచ్చేసాడు .
బుకింగ్స్ అల్ ఓవర్ ఇండియా రికార్డ్స్ సృస్టిస్తున్నా నార్త్ లో మాత్రం అంత ఊపు రాలేదు. కోటి రూపాయిలైనా కల్లెక్ట్ చేస్తుందా అని పెదవి విరుపు మాటలు బానే వినపడ్డాయి. కట్ చేస్తే సీన్ సాయంతరానికి మారిపోయింది.
హిందీ వాళ్ళకి దేవరోడు ఎక్కేసాడు. మాస్ బెల్ట్ లో వాక్-ఇన్స్ రచ్చ లేపుతున్నాయి. ఆన్లైన్ టికెట్ సేల్స్ కూడా బాగానే జరగడంతో తొలి రోజు 8 కోట్ల వరకు వసూలు చేసాడు.
Read Also : మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
ఇక డే 2 కి వచ్చేసరికి సరాసరి ౩౦% కలెక్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటేనే మనం చెప్పచు దేవరోడి జాతర నార్త్ లో కూడా మొదలైంది అని. ఇప్పుడు హిందీ డే 1 కలెక్షన్స్ చూసుకుంటే 8 కోట్లు వరకు కలెక్ట్ చేసిందని చెప్పారు . ఇక సండే దేవర హిందీ కలెక్షన్స్ 16+ ఉంటుంది అని అక్కడ ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నారు.
అక్టోబర్ 2 పబ్లిక్ హాలిడే కావడం తో దేవర సినిమా బలం ఆరోజు బయటపడుతుందని లాంగ్ రన్ లో 1౦౦ కోట్లు కలెక్ట్ చేస్తాడని బల్ల గుద్ది చెప్తున్నారు.
ఈ ట్రెండ్ ఓవర్సీస్ హిందీ షో లో కూడా కనపడుతుంది ఆల్మోస్ట్ 200K$ అక్కడ కూడా వసులు చేసాడు ఎన్టీఆర్.
రాజమౌళి లేకుండా, సీక్వెల్ హైప్ కాకుండా నార్త్ లో ఈరంజ్ మాస్ రచ్చ చేస్తున్నాడంటే. ఇక వార్2 కి ఎలా ఉంటదో అని ఎన్టీఆర్ అభిమానులు అప్పుడే లెక్కలేసుకుంటున్నారు.
Follow us on Instagram