మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు..
ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..?
NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి అయింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 17 నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్‌ని వికారాబాద్ అడవులు, పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్టు సమాచారం..
ఇప్పటికే ప్రశాంత్ నీల్ టీమ్ వికారాబాద్ అడవుల్లో లొకేషన్స్ వేట మొదలెట్టినట్లు సమాచారం… ఈ అడవుల్లో కొన్ని ఫైట్ సీన్స్, నేచురల్ విజువల్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. అయితే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ లేని సీన్స్ తీయనున్నట్లు సమాచారం..మార్చి నెలలో ఎన్టీఆర్ ఈ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు..