మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు..
ప్రభాస్ “ఫౌజీ” రిలీజ్ పై మేకర్స్ సరికొత్త స్ట్రాటెజీ..!!
ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు తారా స్థాయికి చేరాయి . కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం అలాగే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గత కొద్ది రోజులుగా ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.అంతేకాక ఈ సినిమాలో చాలా అవుట్ డోర్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, కోల్‌కతా, గోవా మరియు శ్రీలంకతో పాటు ఇతర ప్రదేశాలలో చిత్రీకరించబడుతుందని సమాచారం… ఈ సినిమాలో కన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..