MOVIE NEWS

NTR-NEEL : ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం.. ఓపెనింగ్ షాట్ అదిరిందిగా..!!

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ గత ఏడాది సెప్టెంబర్ 27 న “దేవర” సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్‌ 2” లో  కీలక మైన పాత్రలో నటిస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఎన్టీఆర్  పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఫినిష్ అయినట్లు తెలుస్తుంది. దీనితో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై ఫోకస్ చేసాడు.

ఆ స్టార్ హీరో సినిమాకు పోటీగా ప్రభాస్ ‘రాజాసాబ్’..బాక్సాఫీస్ క్లాష్ తప్పేట్లు లేదుగా..!!

ప్రశాంత్ నీల్  కాంబోలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ను నేడు ఎంతో గ్రాండ్ గా ప్రారంభించారు.ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమైందంటూ మైత్రి మూవీ మేకర్స్‌ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ఎన్టీఆర్‌ -నీల్‌ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎంతో ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు గత ఏడాదే పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ అనుకున్నదాని కంటే కాస్త ఆలస్యంగా షూటింగ్‌ ప్రారంభం అయింది..

ఈ ఓపెనింగ్‌ షార్ట్ సెట్స్‌లోనే సుమారు 1,500 మంది జూనియర్ ఆర్టిస్టులతో నీల్‌ షూటింగ్‌ తీసినట్లు సమాచారం.. కేజీఎఫ్‌, సలార్‌ సినిమాల తర్వాత నీల్ తీస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను కూడా నీల్ రెండు పార్ట్స్ గా తెరకెక్కించనున్నాడు..

 

Related posts

నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!!

murali

తన డ్రీమ్ డైరెక్టర్ డైరెక్షన్ లో మూవీకి సిద్ధమవుతున్న నాని..!!

murali

పవన్ కోసం మళ్ళీ రంగంలోకి రమణ గోగుల..?

murali

Leave a Comment