MOVIE NEWS

ఎన్టీఆర్ -నీల్ మూవీ బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో మోస్ట్ అవైటెడ్ మూవీలో నటిస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వర్షం : రీ రిలీజ్ కు సిద్దమైన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి మేకర్స్ భారీ అప్డేట్ ఇచ్చారు.. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు..

కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా జూన్ 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. అలాగే యంగ్ టైగర్ పుట్టిన రోజు కానుకగా మే 20న న ఎన్టీఆర్, నీల్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.. సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ దేవర 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు..నీల్ సినిమాతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నారు..

Related posts

రీ రిలీజ్ కి సిద్దమైన ఐకాన్ స్టార్ కల్ట్ క్లాసిక్ మూవీ..!!

murali

ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!!

murali

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే.. వాయిదా పర్వంలో వీరమల్లు..?

murali

Leave a Comment