MOVIE NEWS

NTR-NEEL : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టైటిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల “దేవర” సినిమాతో పాన్ ఇండియా వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసిన ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాలేదు. దీనికి కారణం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “వార్ 2 “ సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ పూర్తి కాకపోవడమే.. రీసెంట్ గా తారక్ పార్ట్ షూట్ ముగియడంతో నేడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నీల్‌ సినిమాకు టైటిల్‌ ఫిక్స్ అయింది. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న పేరునే ఇప్పుడు ఫిక్స్ చేసేశారనే న్యూస్ వైరల్ అవుతుంది..గత కొంతకాలంగా “డ్రాగన్” టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అయింది..కానీ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్‌ రంగనాథన్‌ లేటెస్ట్ మూవీకి ”డ్రాగన్ “ అనే టైటిల్ పెట్టడంతో ఎన్టీఆర్ నీల్ మూవీకి టైటిల్ చేంజ్ చేస్తారనే ప్రచారం జరిగింది..ప్రదీప్ రంగనాథన్‌ నటించిన ఆ సినిమా తమిళ్‌లో డ్రాగన్‌ పేరుతో తెరకెక్కగా.. తెలుగులో రిటర్న్ ఆఫ్‌ ది డ్రాగన్‌ అని రిలీజ్‌ చేస్తున్నారు.

దీన్ని బట్టి ఎన్టీఆర్‌ – నీల్‌ కు “డ్రాగన్‌” అనే పేరును మేకర్స్ ఫిక్స్ చేసినట్టే అనేది లేటెస్ట్ ట్రెండింగ్‌ న్యూస్…ఈ సినిమా కోసం ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో స్పెషల్‌ సెట్‌ వేసారు… ఈ సెట్లోనే నేడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్‌ని ఎన్టీఆర్‌ లేకుండానే ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం… సెకండ్‌ షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్‌ అవుతారు.

 

Related posts

పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!!

murali

కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!!

murali

ప్రమోషన్స్ షురూ చేయనున్న పుష్పా

filmybowl

Leave a Comment