MOVIE NEWS

సుకుమార్ ని కలిసిన ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇన్నేళ్లలో చేసింది తక్కువ సినిమాలే అయినా తన టేకింగ్ తో గట్టి ఇంపాక్ట్ ఇచ్చాడు.. దర్శకుడు సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో తెరకెక్కించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.. త్వరలో పుష్ప 3 కూడా తెరకెక్కించనున్నాడు.. ఈ గ్యాప్ లో సుకుమార్ రాంచరణ్ తో ఓ బిగ్గెస్ట్ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.. అయితే చరణ్ బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి సుకుమార్ ఖాళీగానే ఉన్నారు..చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చరణ్ తో సుకుమార్ సినిమా తెరకెక్కించనున్నాడు.అప్పటివరకు చరణ్ సినిమా ‍స్క్రిప్ట్ వర్క్ అంతా సుకుమార్ పూర్తి చేయనున్నాడు.

దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!!

ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ ఎన్టీఆర్ ని కలిశారు.మరి సందర్భం ఏంటో తెలీదు గానీ సుకుమార్ ఇంటికి ఎన‍్టీఆర్ వెళ్లారు.. ఈ విషయాన్ని సుక్కు భార్య తబిత ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ‘తారక్ కి ప్రేమతో’ అని సుకుమార్ భుజంపై తారక్ వాలి ఉన్న ఫొటోని ఆమె పోస్ట్ చేశారు. దీన్ని తారక్ రీ పోస్ట్ చేయగా.. మళ్లీ దీన్ని సుకుమార్ రీ పోస్ట్ చేసి.. ‘మై అభిరామ్’ అని రాసుకొచ్చారు.గతంలో సుకుమార్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘నాన్నకు ప్రేమతో’ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది..

తాజాగా వీళ్లిద్దరు మళ్లీ కలవడంతో కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలు పెట్టబోతున్నారా అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2,ప్రశాంత్ నీల్ సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.. ఈ సినిమాల తరువాత కొరటాల తో దేవర 2 ఎటూ లైన్ లోనే ఉంది.. అలాగే నెల్సన్ తో కూడా ఎన్టీఆర్ భారీ సినిమా చేయనున్నారు.. ఈ సినిమాలు అన్నీ పూర్తి అయ్యేసరికి చాలా టైం పడుతుంది..

 

Related posts

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

రజనీకాంత్‌కు అనారోగ్యం.. చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు

filmybowl

అఖిల్ అక్కినేని కొత్త సినిమా ప్రకటన ఆ రోజే నా ?

filmybowl

Leave a Comment