మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బాగా బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’.. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు..ఎన్టీఆర్ తన కెరీర్ లో మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిం చాడని సమాచారం..ఈ సినిమాను మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “ డ్రాగన్ “.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..
బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన నున్నాడు.అయితే ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..ఈ సినిమాకు దాదాపు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి..ప్రస్తుతం ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసారు.. మార్చి 28 న దేవర జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
ఈ నేపథ్యంలో అక్కడి ప్రొమోషన్స్ కోసం దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లారు.. అక్కడి ఫ్యాన్స్ ని కలిసిన ఎన్టీఆర్ వారితో కలిసి ఎంతో సందడి చేసారు.. వారితో కలిసి డాన్స్ కూడా చేసారు.. ఇప్పటికే అక్కడి మీడియా దేవర సినిమా. బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేస్తుంది.. అయితే జపాన్ లో ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. సన్నగా గుడ్ ఔట్ లుక్ లో ఎన్టీఆర్ ఎంతో స్టన్నింగ్ గా కనిపించారు..జపాన్ లో రెండో రోజు పర్యటిస్తూ ఎన్టీఆర్ అక్కడ షినగావా అక్వేరియం ను సందర్శించారు..అలాగే అక్కడున్న షార్క్ లతో ఫోటోలు దిగుతూ కనిపించారు..ప్రస్తుతం ఎన్టీఆర్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి..