MOVIE NEWS

సరికొత్త లుక్ లో ఎన్టీఆర్.. పిక్ అదిరిందిగా..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ అందుకుంది.. రొటీన్ కథ, స్క్రీన్ ప్లే తో దర్శకుడు కొరటాల చేసిన ఈ మాస్ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది..కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ వున్న క్రేజ్ వల్ల ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..

ఇమాన్వి కోసం ప్రభాస్ స్పెషల్ క్యారేజ్. పోస్ట్ వైరల్..!!

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న “వార్ 2”,అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న “ఎన్టీఆర్ నీల్ “ మూవీ అలాగే త్వరలో “దేవర 2” కూడా సెట్స్ పైకి వెళ్ళనుంది.. దీనితో ఎన్టీఆర్ వరుస షూటింగ్స్ తో బిజీ అయ్యారు..ప్రతీ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తున్నాడు..ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్ తో ఎన్టీఆర్ ఆకట్టుకుంటున్నాడు..

తాజాగా ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు.ఎంతో క్యాజువల్ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్, తన లుక్‌తో అభిమానులను ఫిదా చేశాడు. వైట్ టీ-షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్, స్టైలిష్ కళ్లజోడు ధరించిన ఎన్టీఆర్ ఎయిర్‌పోర్ట్ లో సరికొత్త లుక్‌లో అదరగొట్టాడు. మరోవైపు, లక్ష్మీ ప్రణతి డెనిమ్ జాకెట్, క్రీమ్ కలర్ ప్యాంట్ మరియు స్నీకర్స్‌తో క్యాజువల్ స్టైల్‌ను మెయింటైన్ చేశారు.ఈ క్యూట్ కపుల్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

 

Related posts

బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!

murali

స్పిరిట్ : ప్రభాస్ కి సరికొత్త కండీషన్ పెట్టిన సందీప్ వంగా..?

murali

ఎస్ఎస్ఎంబి : హమ్మయ్య ఎట్టకేలకు మొదలు పెడుతున్న జక్కన్న..!!

murali

Leave a Comment