MOVIE NEWS

“దేవర 2” కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..షూటింగ్ ఎప్పుడంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయింది.. అయితే మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా తారక్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపించారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు..అయితే దేవర రెండవ పార్ట్ మీద మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు కొరటాల ఆ సినిమాకి సంబంధించిన కథ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!!

ఈ మధ్యనే కొరటాల శివను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన చెప్పిన కథ విని ఇక జూలై నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోదామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఆ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

గురువారం నుంచి ఈ సినిమా కోసం సిద్ధం చేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.దీనిని బట్టి ప్రశాంత్ నీల్ సినిమాతో పాటు దేవర 2 సినిమా ని కూడా సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. దేవర అసలు కథ తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది..

 

Related posts

ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి బిగ్ అప్డేట్..యాక్షన్ సీక్వెన్స్ తో హైప్ ఎక్కిస్తున్న మేకర్స్..!!

murali

Leave a Comment