NTR Devara Movie 5 Days Worldwide Collections
VIDEOS

ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌

NTR Devara Release Trailer Review

ఎన్నో రోజులుగా అభిమానుల్ని , సినీ ప్రియుల్ని ఊరిస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన NTR Devara Trailer ’ దేవర – భయం తో ధైర్యం కథ చెప్పిన కొరటాల ట్రైల‌ర్ రిలీజ్ అయింది 2 నిమిషాల 40 సెక‌న్ల ట్రైల‌ర్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అనుకొన్న‌ట్టే ఈ ట్రైల‌ర్‌ లో యాక్ష‌న్ కే పెద్ద పీట వేసాడు దర్శకుడు కొర‌టాల.

ఈ ట్రైలర్ లో యాక్షన్ కి పోటీగా డైలాగ్ లు కూడా మొత్తంగా నింపేసాడు దర్శకుడు. ఈ డైలాగ్ లు అన్ని భయం, ధైర్యం, సముద్రం , సంద్రం వీటి చుట్టూ తిరుగుతూ రాసినవే. బహుశా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అంత సముద్రమే కాబట్టి దర్శకుడు ఈ విధంగా రాసాడు అనుకోవాలి. సరే ఆ డైలాగ్స్ ఏంటో చూసేద్దాం పదండి

”దేవ‌ర‌ను చంపాలంటే స‌రైన స‌మ‌య‌మే కాదు, స‌రైన ఆయుధం కూడా దొర‌కాల‌”
“మ‌నిషికి బ‌తికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడ‌దు అని మీరు ఆ ధైర్యాన్ని కూడ‌గ‌డితే, ఆ ధైర్య‌న్ని చంపే భ‌య‌మ‌వుతా”
“కులం లేదు మ‌తం లేదు ధైర్యం త‌ప్ప ఏమీ లేదు”
”ప‌ని మీద పోయినోడైతే ప‌ని అవ్వంగానే తిరిగొస్తాడు. పంతం మీద పోయాడు నీ కొడుకు”
“భ‌యం మ‌ర‌చి ఎప్పుడైనా త‌ప్పుడు ప‌ని కోసం సంద్రం ఎక్కితే… ఈ రోజు నుంచి మీకు కాన‌రాని భయం అవుతావుండా”

Read Also : మనసిలాయో పాట అదరహో…

ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాడు. దేవ‌ (పెద్ద ఎన్టీఆర్) ధైర్య‌వంతుడు. వ‌ర‌ (కొడుకు) భ‌య‌స్థుడు. ఈ రెండు పాత్ర‌ల పరిచయం చేసి ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చేసాడు ద‌ర్శ‌కుడు. టెక్నిక‌ల్ గా ఈ సినిమా చాలా ఉన్నత స్థాయి లో తీర్చిదిద్దారు .
సైఫ్ అలీ ఖాన్, ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌కాంత్ పాత్ర‌లు, ముసలి గెట్ అప్స్ లోనే కనిపించారు. జాన్వీ క‌పూర్ కి తొలి సినిమా నే మంచి పాత్ర లభించినట్టు ట్రైలర్ లో తెలుస్తుంది. కొరటాల ముందుగానే చెప్పినట్టు దేవ‌ర‌ చిత్రం కోసం ఓ ప్ర‌పంచాన్నే సృష్టించారు. నిరుద్ ఎప్పటిలానే తన మీద పెట్టుకున్న అంచనాలని మరోసారి దాటేశాడు. మొత్తంగా ట్రైలర్ అభిమానులకి తెగ నచ్చేస్తుంది. చూద్దాం ట్రైలర్ లో వున్నట్టే సినిమా కూడా ఉంటే ఎన్టీఆర్ మళ్ళి రికార్డుల వేట మొదలెట్టినట్టే

Follow us on Instagram

Related posts

మట్కా నుంచి లే లే రాజా సాంగ్ విడుదల

filmybowl

సాయి దుర్గ తేజ్ బర్త్‌ డే స్పెషల్ గా SDT18 మేకింగ్ వీడియో రిలీజ్..

filmybowl

రిలీజ్ ఐన వేట్టయన్ ట్రైలర్: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజినీకాంత్…

filmybowl

Leave a Comment