NTR Devara Movie 5 Days Worldwide Collections
MOVIE REVIEWS

దేవర మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

NTR Devara Part 1 Movie Full Review
NTR Devara Part 1 Movie Full Review

NTR Devara Part 1 Movie Full Review

తారాగణం: ఎన్టీఆర్ జూనియర్ , జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ , అజయ్, శ్రీకాంత్, శ్రుతి మరాఠె, గెటప్ శీను, సుదేవ్ నాయర్, నరేన్
ప్రొడక్షన్: ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్
ప్రొడ్యూసర్స్: కొసరాజు హరికృష్ణ , మిక్కిలినేని సుధాకర్
రైటర్ & డైరేక్షన్: కొరటాల శివ
మ్యూజిక్: అనిరుద్
రిలీజ్ డేట్: 27 , సెప్టెంబర్, 2024

దాదాపు 6 ఏళ్ళ తర్వాత సోలో హీరో గా వస్తున్న ఎన్టీఆర్ , ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న సినిమా కావడం , ఎన్టీఆర్ కి రాజమౌళి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం రిసల్ట్ మీద అందరికి ఆసక్తి ఏర్పడింది. మరి ఆ అంచనాలని ఈ చిత్రం అందుకుందో లేదో చూద్దాం పదండి

కథ:
ఆంధ్ర – తమిళనాడు సరిహద్దు ప్రాంతం లో సముద్రం వడ్డున ఉండే నాలుగు ఊర్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు అక్కడి జనం. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనదేశ సంపదనని కాపాడి అవి జనానికి పంచుతూ ఇక్కడి వాళ్ళు మంచి పేరు సంపాదించుకున్నారు. కాల క్రమేణా అక్కడి ప్రజలు వాళ్ళకి బాగా తెలిసిన విద్యని అక్రమంగా రవాణా అయ్యే సరుకు ని పట్టుకొచ్చి పెద్దలకి ఇవ్వడం సొమ్ము చేసుకోడంని పని గా పెట్టుకొని జీవనం కొనసాగిస్తుంటారు. ఐతే తాము చేస్తున్నది తప్పని గ్రహించిన ఎర్ర సముద్రం నాయకుడు దేవర (ఎన్టీఆర్) ఇకపై ఈ పని ఆపేయాలని ఎర్రసముద్రంలో అందరికి హుకుం జారీ చేస్తాడు. కానీ ఆ బృందంలోనే ఉన్న మరో ఊరి పెద్ద భైరా (సైఫ్ అలీఖాన్)తో పాటు మరి కొందరికి దేవర ఆలోచన నచ్చదు. దేవర మాట కాదని సముద్రం ఎక్కాలనుకున్న అందరికి దేవర భయాన్ని రుచి చేయిస్తాడు దీంతో వాళ్లు దేవరకు ఎదురెళ్తారు. అంతమొందించడానికి రెడీ అవుతారు ఈ క్రమంలోనే దేవర ఒకరోజు అదృశ్యమవుతాడు. దేవర ఆచూకీ కోసం భైరా.. తన మనుషు లు వెతుకుతూనే ఉంటారు. మరోవైపు దేవర బిడ్డ దేవర కి పూర్తి బిన్నంగా భయస్తుడిగా అదే ఎర్ర సముద్రం లో జీవనం కొనసాగిస్తుంటారు. వార ఎందుకు ఆలా మారిపోయాడు. అస్సలు దేవర ఎక్కడకి వెళ్ళాడు, మళ్ళీ ఎర్ర సముద్రం వాళ్ళు సంద్రం ఎక్కారు లేదా. కనపడకుండా అదృశ్యమైన దేవర ని మళ్ళీ వెనక్కి వచ్చాడా. భైర ఎం అయ్యాడు అనే ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే
కొత్త ప్రపంచం , వాళ్ళ అలవాట్లు, అక్కడి పరిస్థితులు ,సంఘటనలు చూపిస్తూ ముందుకి వెళ్లడం ఈ తరం దర్శకుల ఎంచుకున్న కొత్త పంథా. కొరటాలకి ఈ టైపు కథనం చెప్పడం రెండో సారి. ఆచార్య తో ఇలాంటి నేపధ్యాన్ని ఎన్నుకొని సక్సెస్ అవ్వని కొరటాల పంతం పట్టి మరి అలంటి నేపధ్యాన్ని తీసుకొని దేవర తీసాడు. జరిగిన తప్పుని విశ్లేషించుకుని ఈ సారి కత్చితంగా సక్సెస్ అవుతాడని అందరూ అనుకున్నారు , అలాగే ఎన్టీఆర్ కూడా తన గత ఆరు సినిమాల నుంచి స్టోరీ సెలక్షన్ లో మంచి జడ్జిమెంట్ చూయిస్తూ వస్తుండడంతో దేవర కత్చితం గా బ్లాక్ బస్టర్ అవుతందనే నమ్మకాలూ ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ లు అనుకున్నంత లేకపోయినా సినిమా మీద భారీ హైప్ అయితే వచ్చేసింది. ఆ అంచనాలని సినిమా మొత్తంగా అందుకుంది అని చెప్పలేం గాని సగానికి పైగానే ప్రేక్షకులిని మెప్పించింది అనిమాత్రం చెప్పచ్చు.

సముద్ర నేపధ్యం , ఒకే ఊరి కి సంబంధించిన నాలుగు పెద్దింటి మనుషుల మధ్య కొట్లాట ఈ సెటప్ చూస్తే కొరటాల ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడు అనిపిస్తుంది. దానికి తగ్గట్టు గానే ఎలేవేషన్ డైలాగ్స్ తో , హీరో ఇంట్రడక్షన్ సీన్స్, బ్యాక్ డ్రాప్ కొత్తగా అనిపిస్తాయి. దానికి తోడు అనిరుద్ బీజీఎం సినిమా ని ఒక రేంజ్ లో తీసుకెళ్తాయి కానీ అంతే వేగంగా కిందకి దించేసాడు దర్శకుడు అనడంలో సందేహం లేదు. కానీ మొదటి సగం పరంగా ప్రేక్షకుడికి పెద్దగా కంప్లైంట్ ఉండదు. సినిమా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుధ పూజ సాంగ్ , ఆ తర్వాత వచ్చే ఫైట్, ఎలేవేషన్ సీన్ అన్ని చక్కగా కుదిరాయి. ఇంటర్వెల్ ఈ సినిమా కి మరో హైలైట్ ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ చక్కగా రాసుకున్నాడు దర్శకుడ.
మొదటి సగం దేవర కి ఇచ్చేసిన దర్శకుడు మలి సగం వర కి ఇచ్చేసాడు. భయస్థుడైన హీరో తండ్రి చేసేవాటికి దూరంగా వుంటూ, తండ్రి అంటేనే ఇష్టంలేకుండా ఉంటాడు. హీరోయిన్ జాహ్ణవి ఎంట్రీ కూడా ఇక్కడే వస్తుంది. జాహ్నవి వున్నది తక్కువ సేపే ఐన నటన, అందం తో మనల్ని కట్టిపడేస్తుంది. వర, తంగం మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అందంగా చిత్రీకరించారు
ఇంక ఆ తర్వాత కాసేపు సినిమా సాగదీత సన్నివేశాలతో ముందుకు నడిపించాడు దర్శకుడు
మళ్ళీ సినిమా పట్టాలెక్కేది ప్రీ- క్లైమాక్స్ లోనే. అక్కడ వచ్చే సముద్రం సన్నివేశాలు గూసిబంప్స్ తెప్పిస్తాయి. పార్ట్ 2 కి లీడ్ ఇస్తూ కథ ముగించాడు దర్శకుడు. క్లైమాక్స్ లో కొరటాల తనలోని రైటర్ ని బాగా వాడుకున్నాడు. పార్ట్ 2 లీడ్ కి వాడుకున్న సన్నివేశం మాత్రం ఆల్రెడీ బిగ్గెస్ట్ హిట్ ఐన ఒక సన్నివేశం నుంచి స్ఫూర్తి పొందాడు అనడం లో సందేహం లేదు.

Read Also :  ర‌క్తంతో సంద్ర‌మే ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర క‌థ‌

నటీనటుల పనితీరు

దేవర గా , వర గా ఎన్టీఆర్ అత్యద్భుతంగా నటించాడు. సినిమాని కంప్లీట్ గా వన్ మ్యాన్ షో చేసాడనే చెప్పచ్చు. రెండు పాత్రలకి చక్కటి డిఫరెన్స్ చూయిస్తూ ఆ పాత్రలకి ప్రాణం పోసాడు

దేవర తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాహ్ణవి తొలి సినిమాతోనే ఆకట్టుకుందని చెప్పాలి. వరని ప్రేమించే తంగమ్మగా జాహ్నవి ఇందులో చాలా తక్కువ సమయమే ఉంది. కొన్ని సీన్లు, ఒక పాటతో సర్ధేశారు. ఉన్నంతలో చలాకీగా, అందంగా కనిపించడమే కాక హుషారుగా నటించింది.

ఇక సైఫ్ కూడా తన పాత్ర మేరకు నటించాడు పెద్దగా మెరుపులు కనపడలేదు. ఇక మిగిలిన నటులు ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , షైన్ టామ్ చాకో , చైత్ర వాళ్ళకి ఇచ్చిన పాత్రలు వరకు న్యాయం చేసారు అనే చెప్పాలి. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమాకి పెద్ద అసెట్ అనిరుద్ మ్యూజిక్. తాను లేకుండా ఈ సినిమా ని ఊహించుకోలేం అంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా కి ఎంతగా తాను న్యాయం చేసాడనేది . రత్నవేలు కెమెరా పనితనం, ఎర్ర సముద్రాన్ని ప్రేక్షకులకి చూపించిన వైనం మరొక పెద్ద ఆకర్షణ ఈ సినిమా కి.

దర్శకుడు కొరటాల తన ముందు చిత్రం ఎందుకు ప్లాప్ ఐంది అలా అవ్వకూడదు అని అనుకోని ఈ సారి గట్టిగా ప్రయత్నించి తీసిన సినిమా దేవర అని చెప్పడం లో సందేహం లేదు

కథ.. నేపధ్యం , పాత్రల వేషధారణ ‘ఆచార్య’తో పోలికలు కనిపించినప్పటికీ ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిపోవడం ప్రతి సన్నివేశం లో కూడాను ఏదోకటి వర్క్ అవుట్ అయేటట్టు ఉండడం తో ఎక్కువ సన్నివేశాలు పాస్ అయిపోయాయి అనే చెప్పాలి.

మొదటి సగం లో ఎర్రసముద్రం నేపథ్యం ప్రేక్షకుడిని కధలో లీనమయ్యేలా చేస్తుంది. విజువల్స్ ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. యాక్షన్, పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు మంచి ఫీల్ ని ఇస్తాయి.

ద్వితీయార్ధంలో ఎర్ర సముద్రం వ్యవహారం సాగతీతగా ఎక్కువ అయింది. ‘దేవర’ కథ లో .. వర పాత్రకు సంబంధించి అతి ముఖమైన సీన్ ఆల్రెడీ ప్రేక్షకులు ఊహించేయడం ఈ సినిమా కి అతి పెద్ద మైనస్ దీనికి భిన్నంగా దర్శకుడు కొరటాల ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘దేవర’ కోసం కొరటాల ఎంచుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఈ సినిమాకి ఒక అసెట్ అనే చెప్పుకొవచ్చు
కథ లో కొత్తదనం లేకపోయినా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే అంశాలకు లోటు లేదు.
ఎన్టీఆర్ కోసం, యాక్షన్, కోసం, అద్భుతమైన సాంకేతిక హంగుల కోసం ‘దేవర’ ని నిస్సందేహం గా చూసేయచ్చు . పార్ట్-2 ఎలా డీల్ చేస్తాడు కొరటాల అనేది ప్రేక్షకుడి మధిలో వున్న అతి పెద్ద ప్రశ్న

చివరగా
దేవరా….సాగదీత తగ్గించాల్సింది
Filmy Bowl Rating: 2.5/5

Follow us on Instagram

Related posts

‘వేట్టయాన్’ మూవీ రివ్యూ

filmybowl

35 – చిన్న కథ కాదు మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం

filmybowl

‘జనక అయితే గనక’ రివ్యూ: కామెడీ కోర్ట్ రూమ్ కథ

filmybowl

Leave a Comment