MOVIE NEWS

స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఇదిలా ఉంటే ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. మార్చి 28 న ఈ సినిమాను మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు…తాజాగా ఎన్టీఆర్ జపాన్ లో దేవర మూవీ ప్రొమోషన్స్ కోసం అక్కడికి వెళ్ళాడు.. జపాన్ ప్రేక్షకులతో ఎన్టీఆర్ ఎంతో సందడి చేస్తున్నాడు.. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.దీనికి రెండో పార్టును కూడా తీస్తామని మూవీ టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది..త్వరలో పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు కానుంది..

స్పిరిట్ : ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరో.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..?

ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే దేవర సినిమాను మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు.. జపాన్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా ఓ థియేటర్ లో సందడి చేశారు. అక్కడ జపాన్ అభిమానులు దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. వారితో ఎన్టీఆర్ కూడా సరదాగా ఈ పాటకు స్టేజిమీదనే డ్యాన్స్ చేసి అలరించారు. దాంతో చప్పట్లు, అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది..

అయితే అక్కడి మీడియా దేవర మూవీని బాగా హైలెట్ చేస్తోంది. మరి రిలీజ్ అయ్యాక అక్కడ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు..

 

Related posts

రేలంగి మావయ్యగా రజనీకాంత్.. ఆ ఊహ ఎంత బాగుందో..!!

murali

ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది….

filmybowl

సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment