మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..దేవర కి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది.. దేవర సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ ను ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు.దేవర సినిమాతో తొలిసారి బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా అద్భుతంగా నటించాడు..
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!!
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు… ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల నిర్మాత ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో లండన్ వెకేషన్ కి వెళ్లారు.. లండన్ వీధుల్లో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు..
తాజాగా లండన్‌లోని హైడ్ పార్క్‌లో తన పిల్లలతో కలిసిఎన్టీఆర్ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు… ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.ఎన్టీఆర్ లైనప్ లో మరో భారీ సినిమా కూడా యాడ్ కానుంది.. ఇటీవల జైలర్ తో భారీ హిట్ అందుకున్న నెల్సన్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..
Tiger @tarak9999 chilling on the streets of London ♥️🐯#JrNTR #War2 #NTRNeel #Dragon pic.twitter.com/LLxLG5N7zc
— poorna_choudary (@poornachoudary1) December 28, 2024