క్యూట్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తమిళ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.. ఈ భామకు తెలుగు లో సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నా కానీ ఐదేళ్ల క్రితం ఈ భామ తెలుగులో చేసినా ఒకటి రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ భామ తెలుగు సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదు.ఐతే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో ఐశ్వర్య రాజేష్ తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. హోమ్లీ లుక్ తో తనదైన పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో టాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించింది.విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు..
డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “సలార్ 2” మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!!
ఈ సినిమా అద్భుత విజయం సాధించడంతో తెలుగులో ఐశ్వర్య రాజేష్ కు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం వుంది..ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది.. ఐశ్వర్య రాజేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలుగులో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరన్న ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తన దృష్టిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది…
తాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానని.. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, డ్యాన్సుల్లో చాలా స్పెషాలిటీ ఉంటుందని ఐశ్వర్య రాజేష్ తెలిపింది… టాలీవుడ్ లో అందరి ప్రదర్శన ఇష్టమే కానీ ఎన్టీఆర్ నా ఫేవరెట్ అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది..అయితే తారక్ పై ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు