No clarity on release dates in Tollywood
MOVIE NEWS

వీరమల్లు కాదనుకుంటే విశ్వంభర రెడీ

No clarity on release dates in Tollywood
No clarity on release dates in Tollywood

Tollywood : ఈ మద్య టాలీవుడ్ లో క్రమశిక్షణ తగ్గుతుంది. ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ ని ఎవరు పాటించటలేదు. ప్రతి సినిమా వాయిదానే వేస్తున్నారు. నిన్న వచ్చిన దేవర, రేపు రాబోతున్న పుష్ప, ఎప్పుడు వస్తదో తెలియని NBK109. ఇప్పుడు ఆ కోవలోకి మరో రెండు సినిమాలూ చేరాయి.

అధికారికరంగా ప్రకటించలేదన్న మాటే కానీ గేమ్ ఛేంజర్, విశ్వంభర వాయిదా పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.

సంక్రాంతి ఇంకా దూరంలో ఉన్నా థియేటర్లను అగ్రిమెంట్ చేసుకునే వ్యవహారాలు ఈ టైం కళ్ళ మొదలవుతాయి. సో గేమ్ చేoజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సర్కిల్లో ఉన్న బయ్యర్లకు ఎస్విసి బ్యానర్ లో రూపొందుతున్న రామ్ చరణ్, వెంకటేష్ సినిమాలు పండక్కి వస్తాయని, ఆ మేరకు ఏర్పాట్లలో ఉండమని చూచాయగా చెప్పేశాడట.

వీలైతే దసరాకు అనౌన్స్ మెంట్లు ఉంటాయి అని లేదా దివాళీ కి ఐన అనౌన్స్ వస్తుందని వినికిడి. సరే ఎలాగోలా గేమ్ ఛేంజర్ కు మంచి డేట్ సీసన్ దొరికిందని ఫ్యాన్స్ సంబరపడ్డా అసలు ఛాలెంజ్ విశ్వంభరకు ఉంటుంది.

ఎందుకంటే ఆ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ విజువల్ వండర్ కు మోస్ట్ లీ సోలో డేట్ కావాలి. మార్చి చివరి వారం దానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మార్చ్ చివరి
వారాన్ని పవన్ హరిహర వీరమల్లు ఆక్క్యూపై చేస్తుందని ఆల్రెడీ అఫీషియల్ గా డేట్ లాక్ చేసుకుని కొన్ని వారాల క్రితమే పోస్టర్ వదిలింది.

Read Also : వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

గతంలో విజయ్ దేవరకొండ 12 కూడా మార్చ్ లో ఇదే తేదీని అధికారికంగా ప్రకటించుకుంది. పవన్ వీర మల్లుతో వస్తున్నాడు కాబట్టి VD12 కచ్చితంగా వాయిదా వేస్తారు.

ఇప్పుడు విశ్వంభర ఏం చేస్తాడన్నది అసలు ట్విస్టు. అంతర్గత సమాచారం ప్రకారం ఒకవేళ మళ్ళీ కొన్ని కారణాల వల్ల హరిహర వీరమల్లు కనక వెనుకడుగు వేస్తే ఆ స్లాట్ ని వెంటనే చిరంజీవి విశ్వంభర ని లాక్ చేసుకుంటాడు. అంటే తమ్ముడు స్థానంలో అన్నయ్య వస్తాడన్నమాట. కానీ వీర మల్లు నిర్మాత ఏఎం రత్నం ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటె చాలా ఏళ్లుగా వాయిధాలు పడుతున్నా సినిమా అది. కాబట్టి రత్నం మల్లి వాయిదా వేసి ఆలోచన చేయడనే అంటున్నారు.

ఇది అర్థం చేసుకునే పవన్ కళ్యాణ్ ఓజిని కాదని వీరమల్లుకి డేట్లు ఇచ్చారు. సో విశ్వంభర ఇంకో ఆప్షన్ చూసుకోవాల్సి రావొచ్చు. అదే జరిగిన పక్షం ఏప్రిల్ లేదా జూన్ ఈ రెండు నెలల్లో ఒక మంచి టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు చెప్పేదాకా ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.

Follow us on Instagram

Related posts

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

murali

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

murali

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

Leave a Comment