MOVIE NEWS

NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!!

నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు.. తమ్ముడు తారక్ తో తన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో ఆయన నటించిన చివరి సినిమా “డెవిల్”.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం.మెప్పించలేదు.అయితే గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు.

RC16 : చరణ్ మూవీ కోసం సిద్ధమవుతున్న శివన్న..!!

కల్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.ఇదివరకు ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్‌ కనిపించబోతున్నాడు. ”కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది. అలాగే ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నట్లు న్యూస్ వైరల్ అయింది…

అయితే ఆ రెండు కాకుండా ఈ సినిమాకు లేటెస్ట్ గా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. వైజయంతి అనే పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి కనిపించబోతున్నారు..చిత్ర కథ నేపధ్యానికి అనుగుణంగా ఈ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారని సమాచారం.. ఈ విషయాన్నీ త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Related posts

ఎస్ఎస్ఎంబి : బిజీఎం కోసం రంగంలోకి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!!

murali

అదుర్స్ సీక్వెల్ అందుకే వద్దనుకున్నా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?

murali

Leave a Comment