MOVIE NEWS

నితిన్ “తమ్ముడు” రిలీజ్ డేట్ ఫిక్స్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ను గత నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి.ఎలాంటి సినిమా చేసినా కూడా నితిన్ కు అదృష్టం కలిసి రావడం లేదు.. అయితే యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ ఇటీవల రిలీజ్ అయిన రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు.నితిన్ లాస్ట్ హిట్ మూవీ’ భీష్మ’.. ఆ సినిమా తరువాత నితిన్ చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అయ్యాయి..దీంతో మరోసారి భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేసాడు.అయితే నితిన్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నితిన్ ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరినట్లు అయింది..ఇప్పుడు నితిన్ ఆశలన్నీ తమ్ముడు సినిమాపైనే.

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్.. క్రేజీ పిక్ అదిరిందిగా..!!

వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా ఊహించిన దాని కంటే మరింత కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు అసలు ఊహించలేరని రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో నితిన్ తెలిపాడు.వరుసగా 6 ప్లాప్స్ రావడంతో నితిన్ కెరీర్ గాడి తప్పింది.నితిన్ ఈ సారి ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని తమ్ముడు సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది..

తాజాగా తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం.. మొదట ఈ సినిమాను మే లో రిలీజ్ చేయాలని భావించినప్పటికి మేకర్స్ వాయిదా వేశారు. తాజాగా జులై 4న తమ్మడు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ లయ కీలక పాత్ర పోషిస్తుంది..దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది..అక్కా తమ్ముడి సెంటిమెంట్ తో ఈ సినిమా సాగనుందని సమాచారం..

Related posts

ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!!

murali

విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

murali

“ఛావా”కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. స్పందించిన నిర్మాత..!!

murali

Leave a Comment