Nithiin multistarrer with that star hero
MOVIE NEWS

నితిన్ మల్టీస్టారర్ మూవీ.. ఇంకో హీరో ఎవరో తెలుసా ?

Nithiin multistarrer with that star hero
Nithiin multistarrer with that star hero

Nithiin multistarrer : యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. తనకి భీష్మా లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ గా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు అందులో శ్రీలీల కథానాయిక.

అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. వేణు పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చిత్రం తర్వాత తీస్తున్న సినిమా ఇదే.

ఆల్రెడీ ఈ రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగానే తన కెరీర్ ని ఇష్క్ తో నిలబెట్టిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది హోం ప్రొడక్షన్ అని తెలుస్తుంది

ఇప్పుడు నితిన్ మరో సినిమాకి కి సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. యూత్ హీరో నిఖిల్ తో అర్జున్ సురవరం చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు టీఎన్ సంతోష్ నితిన్ కి ఒక స్టోరీ వినిపించారట.

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా నడిచే ఈ కథ వినగానే నితిన్ కి కథ చాలా బాగా నచ్చింది అట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కూడా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లోనే ప్లాన్ చేద్దామని కూడా నితిన్ చెప్పారట.

Read Also : ఒకే స్టేజ్ పైకి పాన్ ఇండియా హీరోలు….

ఈ చిత్రంలో ఇంకో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటంటే ఈ చిత్రంలో మరో హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తారని తెలుస్తోంది. ఇది మల్టీస్టారర్ చిత్రం. సంతోష్.. వెంకటేష్ కి కథ చెప్పారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్ షురూ చేయడమే. కథ వెంకటేష్ పాత్ర చుట్టూ ఉంటుందని టాక్.

ఇది కంప్లీట్ మల్టీస్టారర్ చిత్రమా లేక నితిన్ పాత్ర కొన్ని సీన్లకి మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాల్సి ఉంది. దీనిపై పూర్తి సమాచారం రావలసి ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

రంగ్ దే చిత్రంలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ చిత్రంలో నితిన్ లాయర్ గా, వెంకటేష్ పోలీస్ గా కనిపిస్తారట. ఆల్రెడీ టెస్ట్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరి అనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Follow us on Instagram 

Related posts

అమ్మో..శంకర్ డ్రీం ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

murali

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

murali

గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!!

murali

Leave a Comment