MOVIE NEWS

న్యూ ఇయర్ స్పెషల్ : కొత్త సినిమాల స్పెషల్ పోస్టర్స్ వైరల్..!!

2024 సంవత్సరం దిగ్విజయంగా ముగిసింది.. ఆ సంవత్సరం టాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది.. టాలీవుడ్ సినిమాలు ప్రపంచస్థాయి కలెక్షమ్న్స్ సాధించి చరిత్ర సృష్టించాయి..తాజాగా కొత్త సంవత్సరం వేళ తెలుగు సినిమాల హంగామా మొదలైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ న్యూ ఇయర్ సందర్బంగా తమ తమ సినిమాల పోస్టర్స్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్స్ ఇచ్చారు.. పోస్టర్స్ రిలీజ్ చేసిన ఆ బిగ్ మూవీస్ ఏంటో చూద్దాం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమా మొదలై చాలా కాలమే అయినా ఇప్పటి వరకు సరైన అప్డేట్ రాలేదు..2025 మార్చి 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్బంగా ఈ సినిమా నుండి మొదటి సింగిల్ జనవరి 6, 2025న ఉదయం 9:06 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే “మాట వినాలి” అంటూ సాగే ఈ పాటని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడటం విశేషం. ఈ పాటకు పెంచల్ దాస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి స్వరపరిచారు

ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ రూపొందించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్స్ లోకి రానుంది. ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెష్ చెబుతూ మేకర్స్ ఈ చిత్రం నుండి బాలకృష్ణ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ గా మారింది..

అలాగే శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దర్శకుడుగా శైలేష్ కొలను మంచి గుర్తింపు పొందాడు.. శైలేష్ ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్స్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో హిట్ 3 : ది థర్డ్ కేస్ ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా న్యూ ఇయర్ కానుకగా హిట్ 3 స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు ఇందులో నాని సీరియస్‌ యాక్షన్‌ అవతార్‌లో కనిపించారు. ఈ మూవీ 2025 మే 1న రిలీజ్ కానుంది. ఇదివరకే టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Related posts

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!!

murali

Leave a Comment