MOVIE NEWS

మరోసారి ఆ వీడియో షేర్ చేస్తున్న నెటిజన్స్.. బన్నీ పరువు తీస్తున్నారుగా..!!

పుష్ప 2 తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కి మనస్శాంతి లేకుండా పోయింది చుట్టూ వివాదాలు ఏది మాట్లాడిన ఏది చేసిన వివాదం అల్లుఅర్జున్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లు ఉంది..సంధ్యా థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం పోయిందని..బహిరంగంగా విమర్శించడంతో ఈ ఘటన మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ భారీగా పోస్టులు పెడుతున్నారు..

గ్లోబల్ స్టార్స్ తో తమన్ ధోప్ మూమెంట్.. పిక్ వైరల్

రేవంత్ రెడ్డికి కౌంటర్ గా అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన సమాధానాలకు, థియేటర్ దగ్గర ఆయన చేసిన దానికి ఏ మాత్రం పొంతన లేనట్లుగా వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం మరింత సీరియస్ గా మారింది.బన్నీ అబద్ధాలు చెబుతున్నాడంటూ నెటిజెన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు…ఇదిలా ఉంటే గతంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు ‘పుష్ప ‘ సినిమాపై మండిపడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

“తగ్గేదే లే అంటావా.! రేపు ఓ పిల్లవాడు ఎవరినైనా కొట్టి తగ్గేదే లే అంటాడు.. దానికి ఎవరు బాధ్యులు? తగ్గేదే లే అని ఒక హరిశ్చంద్రుడు లాంటి వ్యక్తీ అనాలి.. అంతేకాని ఒక స్మగ్లర్ అనడమేంటి అని దీని వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు…ఆ హీరో, డైరెక్టర్ నా ముందుకు వస్తే కడిగిపారేస్తాను” అంటూ వీడియోలో గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేసారు..అయితే ఈ వీడియోను నెటిజన్లు మళ్ళీ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Related posts

ప్రభాస్ ‘రాజసాబ్’ టీజర్ రన్ టైం లాక్..!!

murali

గేమ్ ఛేంజర్ : శంకర్ డైరెక్షన్ కి అగ్ని పరీక్ష.. పూర్వ వైభవం చూపిస్తాడా..?

murali

ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్స్..నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

Leave a Comment