MOVIE NEWS

ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా లాంగ్ రన్ లో దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాక్ హైలెట్ గా నిలిచింది..

సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..?

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.తమిళ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీకి తాజాగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు… నెల్సన్ యాక్షన్ మూవీస్ ను బాగా హ్యాండిల్ చేస్తాడు.మాస్ పల్స్ తెలిసిన బాగా తెలిసిన ఈ దర్శకుడుయాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా తెరకెక్కిస్తాడు..రీసెంట్ గా జైలర్ మూవీతో ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.తలైవా రజినీకాంత్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు… దీనితో ఎన్టీఆర్ తో సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..

ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్ ని తాజాగా నిర్మాత నాగవంశీ కన్ఫార్మ్ చేశాడు. నెల్సన్ తో ఎన్టీఆర్ మూవీ తమ బ్యానర్ లోనే ఉంటుందని ఆయన చెప్పాడు. కాకపోతే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేనని నాగవంశీ తెలిపాడు.. ఎన్టీఆర్ వార్ 2,ప్రశాంత్ నీల్ మూవీస్ చేస్తున్నాడు.. నెల్సన్ జైలర్ 2 చేస్తున్నారు.. ఆ కమిట్ మెంట్స్ పూర్తి అయి నెల్సన్ పూర్తి స్క్రిప్ట్ బిల్డ్ చేసుకొని ఎన్టీఆర్ కి వినిపించాలి..ఎన్టీఆర్ ఓకే చెప్పాక ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని నాగవంశీ తెలిపారు..

Related posts

RC16 : గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

murali

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

murali

హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!!

murali

Leave a Comment