MOVIE NEWS

‘కంగువా’ మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్.. దేవిశ్రీ రియాక్షన్ ఇదే..!!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం, గత ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ గా నిలిచినా సినిమా జాబితాలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.. అయితే దేవిశ్రీ అందించిన మ్యూజిక్ పై విమర్శలు రావడం హాట్ టాపిక్ గా నిలిచింది.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే.. వాయిదా పర్వంలో వీరమల్లు..?

‘కంగువా’లోని బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ చాలా మంది ప్రేక్షకులు తట్టుకోలేకపోయారనే కంప్లైంట్స్ చాలా వచ్చాయి..ఈ సినిమాలో క్యారెక్టర్స్ అరుపులు అలాగే బిజిఎం చాలా లౌడ్‌గా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమా చూస్తున్నంత సేపు అసహనానికి లోనయ్యారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల సమయంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ చిత్రానికి సౌండ్ ఇంజినీర్‌గా పని చేసిన ఆస్కార్ విన్నర్ రసూల్ కూడా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

సౌండ్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా మళ్ళీ చూడాలనిపించదని, ఇది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విమర్శలపై దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల స్పందించారు. ట్రోల్స్‌ను పట్టించుకోనని, తన పని మీదే దృష్టి పెట్టానని ఆయన పేర్కొన్నారు. “కంగువా” ఆల్బం నాకు చాలా ప్రత్యేకమైనది. మన్నింపు పాటకు ఎంతో మంది ప్రశంసలు అందించారు. సూర్య ఫ్యాన్స్ ఆ పాటను ఎంతో ఇష్టంగా స్వీకరించారు. సూర్య గారు కూడా నాకు ఫోన్ చేసి మ్యూజిక్ గురించి అరగంట పాటు మాట్లాడారు,” అని దేవిశ్రీ తెలిపారు..

Related posts

ఇట్స్ మీనాక్షి టైం

filmybowl

నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!!

murali

మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?

murali

Leave a Comment