MOVIE NEWS

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా ఈ సినిమా నుంచి “బుజ్జి తల్లి” సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది.. ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకుండానే నాగచైతన్య మరో భారీ సినిమాకు కమిట్ అయ్యారు..విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య  నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించారు… ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు.ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ ఆసక్తికరంగా డిజైన్ చేసారు…ఈ సినిమాను NC24 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా కూడా విరూపాక్ష తరహాలో మిస్టికల్ థ్రిల్లర్ జానర్ కిందకు వస్తుంది అని సమాచారం. దర్శకుడిగా కార్తీక్ దండు పౌరాణిక టచ్‌తో కూడిన అడ్వెంచర్ ఫిల్మ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. డిసెంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ విషయాన్నీ త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
నాగ చైతన్య మరియు కార్తీక్ దండుల కలయిక బాక్సాఫీస్ వద్ద మరో సంచలనాన్ని సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వీరి కాంబో పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి…ఈ సినిమాను SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్ మరియు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

Related posts

బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..?

murali

విశ్వంబర ఎప్పటికి పూర్తయ్యెను ??

filmybowl

Leave a Comment