MOVIE NEWS

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”.. పాన్ ఇండియా డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు…ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. తండేల్ సినిమా పూర్తి కాగానే, నాగ చైతన్య తన తదుపరి చిత్రం షూటింగ్ డిసెంబర్ 12 న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.

విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని అందిస్తుందని సమాచారం.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాను నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దాదాపు రూ. 110 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం..కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రూ.30 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది..విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ థ్రిల్లర్‌గా రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

స్పిరిట్ : టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ఈ సినిమాను నార్త్ ఇండియాలోని పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్లలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ లొకేషన్లు కథకు చాలా కీలకమని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందే నటీనటులు మరియు ఇతర సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా నాగచైతన్య పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో గద్ద కంటిలో యోధుడిగా నాగచైతన్య కనిపిస్తున్నారు. దీనిని బట్టి నాగ చైతన్య ఈ సినిమాలో ఓ వారియర్ గా కనిపించునున్నట్లు సమాచారం.. NC24 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.

Related posts

ప్రభాస్ మొదటి సినిమా కథ ఇదే

filmybowl

విశ్వంబర సినిమా లో అ….అ…అ

filmybowl

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

murali

Leave a Comment