యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. గత కొన్నాళ్ళుగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య కు “ తండేల్ “ మంచి బ్రేక్ ఇచ్చింది.. ఈ మూవీలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో చైతూ, సాయిపల్లవి పోటీ పడి మరి నటించారు..గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది..ఎన్ని సినిమాలు దిగుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతుంది.
హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!
ఇదిలా ఉంటే నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో చేస్తున్నాడు..’వీరూపాక్ష’ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్తీక్ కథ ప్రకారం ఎంతో భయానకంగా చూపించాడు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాగచైతన్య తో చేయబోతున్న సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నట్లు సమాచారం.
అంతేకాదు కార్తీక్ వర్మ.. నాగచైతన్య ను ఒక కొత్త జోనర్ లో చూపించబోతున్నాడని తెలుస్తుంది.. విరూపాక్ష రేంజ్ లోనే ఈ సినిమాలో కూడా సూపర్ ట్విస్టులు వుంటాయని సమాచారం.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వనున్నారు