MOVIE NEWS

నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!!

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. సరిపోదా శనివారం తర్వాత నాని శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 చేస్తున్నాడు
ఈ సినిమాతో పాటు తనకి ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని మరో సినిమా చేస్తున్నాడు.. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న నాని రెండో సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… ఆ సినిమాకు ‘ప్యారడైజ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే టైటిల్ అఫీషియల్ గా రాకముందే లీక్ అయ్యింది.

అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!!

అయితే నాని దసరా సినిమాలో నానితో ఈక్వల్ రోల్ లో దీక్షిత్ శెట్టి నటించాడు. ఫస్ట్ హాఫ్ వరకు అతనికి నానికి సరిసమానమైన పాత్రను శ్రీకాంత్ ఇచ్చాడు..ఐతే సెకండ్ హాఫ్ అంతా నాని అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే నాని ప్యారడైజ్ సినిమాలో కూడా నానితో పాటు మరో కీలక పాత్ర ఉంటుందని సమాచారం. ఆ పాత్రని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానికి ఈక్వల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట.ఆ పాత్ర ఎవరు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది..

ఇటీవల రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమాలో కూడా నానిని డామినేట్ చేసే రోల్ లో ఎస్. జె. సూర్య నటించాడు.. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది.. దీనితో నానికి ఈక్వల్ రోల్ ఎవరు చేస్తున్నారనే దానిపై ప్రేక్షకులలో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది.. మరీ శ్రీకాంత్ ఆ సర్ప్రైజింగ్ రోల్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి..ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం..ఇప్పటికే కీర్తి సురేష్ తో నాని రెండు సినిమాలలో నటించాడు.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..

Related posts

ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..?

murali

ఐకాన్ స్టార్ కి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు..!!

murali

తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!!

murali

Leave a Comment