MOVIE NEWS

లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!!

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. పెయిడ్ ప్రిమియర్స్ తోనే ఈ చిత్రం యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది.. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది..థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. నిర్మాతగా నానికి మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చేరింది..

షూటింగ్ టైం లో ప్రభాస్ నాలో సగం వున్నాడు.. విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు.కోర్ట్ మూవీ సూపర్ హిట్ టాక్ తో పాటు భారీగా కలెక్షన్స్ కూడా రాబడుతుంది.. ఈ సినిమాకు ప్రీమియర్స్ రూపంలోనే దాదాపు రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.. మొదటి రోజు ఈ సినిమాకు ఏకంగా రూ. 8.10 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక శనివారం వీకెండ్ కావండంతో అన్ని సెంటర్స్ లో ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ ప్రత్యక్షం అయ్యాయి.. అయితే వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్స్ ను మేకర్స్ యాడ్ చేసారు.

ఇక రెండు రోజులుకు గాను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.15.90 కోట్లు రాబట్టింది. మొత్తానికి కోర్ట్ సినిమా నానికి భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది..నాని నిర్మాతగా వ్యవహారిస్తున్న మరో క్రేజీ మూవీ “ హిట్ 3”.. ఈ సినిమాలో నానినే హీరోగా నటిస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. దీనితో బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

 

Related posts

డాకు మహారాజ్ : ట్రైలర్ అదిరింది.. కానీ బాబీ చేసిన మిస్టేక్ అదేనా..?

murali

గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

murali

అనిల్ రావిపూడి సినిమా లో మెగాస్టార్ రోల్ పై బిగ్ అప్డేట్..?

murali

Leave a Comment