MOVIE NEWS

తలైవా సినిమాలో నందమూరి నట సింహం.. దాదాపు ఫిక్స్ అయినట్లే..?

తమిళ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ పర్ఫెక్ట్ కంబ్యాక్ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ మూవీ సినిమా ‘జైలర్‌’. ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.రజనీకాంత్‌ సినిమా మంచి కంటెంట్‌ వస్తే ఎలా ఉంటుందో జైలర్ నిరూపించింది. జైలర్‌ సినిమా తర్వాత రజనీకాంత్‌ గేర్ మార్చారు. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు.. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ, తన నుంచి అభిమానులు కోరుకునే పాత్రలను చేస్తూ తలైవా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. జైలర్‌ సినిమా సూపర్ హిట్‌ కావడంతో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ తో ఆ సినిమా సీక్వెల్‌ను కూడా మొదలెట్టేసారు గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే జైలర్‌ సినిమాలో అతిథులుగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన విషయం తెల్సిందే.

కింగ్డమ్ : ట్రెండింగ్ లో ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ముద్దులతో రెచ్చిపోయిన రౌడీ స్టార్..!!

జైలర్‌ 2 లో వారు ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ విషయమై క్లారిటీ రాకుండానే టాలీవుడ్‌ స్టార్‌ బాలకృష్ణ ‘జైలర్‌ 2’ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..సినిమా కథలో భాగంగానే ఒక తెలుగు వ్యక్తి రజనీకాంత్‌కి హెల్ప్‌ చేస్తాడట. ఆ తెలుగు వ్యక్తి బాలకృష్ణ అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. జైలర్‌ సినిమాలో ఇద్దరు సూపర్‌ స్టార్స్ నటించడం వల్ల సినిమా అంచనాలు భారీగా పెరిగాయి, అంతే కాకుండా సినిమాను చూస్తున్న సమయంలో ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యారు.ఆ థ్రిల్‌ను సీక్వెల్‌ను కంటిన్యూ చేసే ఉద్దేశంతో బాలయ్య తో భారీ గెస్ట్‌ అప్పియరెన్స్‌ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం అందుతోంది.

జైలర్‌ 2 సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించడం అనేది దాదాపుగా ఖాయం అని సమాచారం అందుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ ఇప్పటికే బాలకృష్ణ డేట్లు అడిగాడు. త్వరలోనే ఆయన హైదరాబాద్‌ వచ్చి మరీ బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్పనున్నట్లు సమాచారం..ఇతర విషయాల గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ రెండు మూడు రోజులు జైలర్ 2 షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వారాల క్రితం జైలర్‌ 2 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయిన విషయం తెల్సిందే..

Related posts

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “సలార్ 2” మైండ్ బ్లోయింగ్ అప్డేట్..!!

murali

AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..?

murali

ఆ పాత్ర చూసి ఈర్ష్య తో అద్దం పగలగొట్టా.. శివాజీ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment