Nandamuri Balakrishna Wishes :
ముఖ్యమంత్రి కి కొడుకు గా
ముఖ్యమంత్రి కి బావ మరిది గా
సెంట్రల్ మినిస్టర్ కి తమ్ముడి గా
నటుడిగా
ప్రజా ప్రతినిధి గా
బాలయ్య నిజ జీవితం లో కూడా ఎన్నో బిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు కానీ ఏనాడు వాటిని వాడుకొని తాను అక్రమార్జన చేసింది లేదు.
ఉన్నది ప్రజలకి పంచడం తప్ప పక్కనోడి రూపాయి మీద ఆశ లేనోడు బాలయ్య
ఒక పక్క నటుడి గా అలరిస్తూ , ఎంఎల్ఏ గా తన హిందూపురం ప్రజలు కోసం ఎప్పుడు నిలబడతాడు, పార్టీ కి కష్టం వస్తే అందరి కంటే ముందు ముందుకొచ్చి నిలబడేది , కార్యకర్తలకు ధైర్యం చెప్పేది బాలయ్యే. మరోవైపు బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన పనులు కూడా దగ్గరుండి చక్కబెడుతుంటారు. అన్‌స్టాపబుల్ లాంటి షోలు సరే సరి.
బాలయ్య కు ఎప్పటి నుంచో ఒక ఫిల్మ్
స్టూడియో కట్టాలన్నది ఆశ. చాలాకాలంగా ఈ విషయమై ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పట్లో ఏపీలో బాలయ్య స్టూడియో కట్టుకోవడానికి తగిన స్థలం కూడా కేటాయించారన్న వార్తలొచ్చాయి. అయితే మధ్యలో ఆంధ్ర లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టేశారు.
అయితే ఈసారి బాలయ్యకు తెలంగాణలో స్టూడియో కట్టుకోవడానికి అనుకూలంగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాబోతున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ స్టూడియో కోసం రెవిన్యూ శాఖ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు, దానికి అనువైన స్థలం కేటాయించినట్టు తెలుస్తుంది. త్వరలోనే అధికారికంగా ఈ విషయం బయటకు రానుంది.
నిజానికి ఇప్పుడు ఏపీలో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. బాలయ్య గట్టిగా కావాలనుకుంటే అక్కడే అడగచ్చు, ఏపీలో స్టూడియోకి తగిన స్థలం అడిగితే ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో అనుమానం ఏం లేదు.
Also Read : ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్
కానీ అలా స్టూడియో కోసం బాలయ్య స్థలం దక్కించుకొంటే, విపక్షం నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సొంత మనుషులకు స్థలాలు ఇచ్చుకొంటూ పోతారా? అంటూ పార్టీ మీద, ప్రభుత్వం మీద నిందలు మోపడానికి అక్కడ వేరే పార్టీ రెడీ గా వుంటది. అందుకే తన వల్ల పార్టీ కి ఇబ్బంది కలగకుడదు అని ఇప్పుడు తెలంగాణలో స్టూడియో నిర్మించడానికి ఆసక్తి చూపించారని అర్థమవుతోంది.
దానితో పాటు బసవతారకం ఆసుపత్రిని ఏపీలో నిర్మించాలన్నది ఆయన కోరిక త్వరలోనే అందుకు తగిన అనుమతులు, స్థలం కూడా బాలయ్యకు మంజూరయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఏపీలో బసవతారం ఆసుపత్రి, తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో.. ఇవి రెండూ బాలయ్య చిరకాల కోరికలు. ఇవి ఇప్పటికి నెరవేరుతున్నాయి. త్వరగా వాటిని కట్టేసి వాడుక లో తీసుకురావాలని అందరం కోరుకుందాం.
Follow us on Instagram
నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!!