nandamuri Bala Krishna in new avatar.... Update tomorrow
MOVIE NEWS

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

nandamuri Bala Krishna in new avatar.... Update tomorrow
nandamuri Bala Krishna in new avatar…. Update tomorrow

Nandamuri Bala Krishna : ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది అనేది ఇండస్ట్రీ లో వినపడుతున్న మాట. ఆ మాట ని నిజం చేస్తూ ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. షోలు చేస్తే వ్యూయర్ షిప్లు దాసోహం అంటున్నాయి. రాజకీయంగా దిగితే ముచ్చటగా మూడో సారి MLA గా గెలిచాడు ఆయన పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచి అధికారం కి వచ్చింది.

భగవంత్ కేసరి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 109వ సినిమా కావడంతో ఎన్బీకే 109 అని పిలుస్తున్నారు ఇంకా టైటిల్ ని చిత్ర బృందం రెవీల్ చేయాల్సి ఉంది.

ఈ సినిమా తర్వాత తన లక్కీ డైరెక్టర్ బోయపాటి తో బ్లాక్ బస్టర్ అఖండ సినిమా కి సీక్వెల్ ఇప్పటికే లైన్ లో పెట్టి ఉన్నారు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో వుండగానే ఈరోజు ఒక కొత్త ఎక్సైటింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అదే బాలయ్య సూపర్‌హీరో పాత్రలో నటించబోతున్నారని. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ముఖ్యంగా ఈ తరం పిల్లల్లో బాలయ్య కి ఉన్న క్రేజ్ ని ఇంకా పెంచే అవకాశముందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు అక్టోబర్ 11 న వెలువడనుంది.

Read Also : Allu Arjun Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…

ఈ సినిమా ఇప్పుడు బాలయ్య అభిమానుllo ,పరిశ్రమ వర్గాల్లో చాలా ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి దాక ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు బయటకి రాలేదు కానీ బాలయ్యను ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా చూపించే ప్రయత్నం జరుగుతుందని మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు.

ఈ ఊహాగానాలు ఒక్క సారిగా ఊపందుకున్న క్రమంలో బాలయ్య అభిమానులు ఈ ప్రాజెక్ట్ అప్ డేట్స్ గురించి ఎదురుచూస్తున్నారు.

బాలయ్య సూపర్‌హీరో అంటే ఇక బాక్సులు బద్దలు కావాల్సిందే అని అంటున్నారు.

నిజానికి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ…. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. PVCU లో భాగంగా వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హీరో సినిమా అనే చర్చ జరుగుతోంది.

ఇప్పుడు బాలయ్య కూడా అదే తరహా సినిమా చేస్తున్నాడు అనే చర్చ రావడం తో ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఏదేమైనా రేపటికి ఈ చిత్రం గురించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.

Follow us on Instagram

Related posts

అందరూ కలిసి బన్నీని ఒంటరి చేసారు.. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

murali

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

గుంటూరు కారం నీ అదే దెబ్బేసింది కానీ, దేవరకు అది ప్లస్ అయింది

filmybowl

Leave a Comment