MOVIE NEWS

బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

నటసింహం నందమూరి బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’.స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కింది.హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అలాగే చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు..

బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..?

కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నిర్మాత నాగవంశీ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘ మీకు సమరసింహా రెడ్డి యాక్షన్ గుర్తుందా. అసలైన మాస్ సినిమా అంటే ఏమిటో నిర్వచించింది ఆ యాక్షన్ అని సమరసింహా రెడ్డి పవర్ఫుల్ యాక్షన్ సీన్ ఫోటోను జతచేస్తూ.. నా మాటలను గుర్తుపెట్టుకోండి. డాకు మహారాజ్ లో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తుకురావడమే కాదు మీకు అదే ఊపునిస్తుంది.

ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్’ అని పోస్ట్ చేసారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్ ఈ నెల 5న రిలీజ్ కానుంది.అలాగే ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..

Related posts

ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..?

murali

“దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!!

murali

ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!!

murali

Leave a Comment