అక్కినేని నాగ చైతన్య గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నాడు.ఈ ఏడాది రిలీజ్ అయిన తండేల్ సినిమాతో వరుస ప్లాప్స్ నుంచి బయట పడ్డాడు.నాగ చైతన్య ఎట్టకేలకు తండేల్ సినిమాతో హిట్ అందుకోవడంతో గత కొంతకాలంగా తీసుకున్న గ్యాప్ ని పూర్తిగా ఫిల్ చేసేందుకు పర్ఫెక్ట్ స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు…తండేల్ తో హిట్ అందుకోవడమే కాకుండా ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు..
విశ్వంభర : హమ్మయ్య మెగాస్టార్ హ్యాపీ..రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
తండేల్ తరువాత వెంటనే విరూపాక్ష ఫేం కార్తీక్ వర్మ దండు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.”NC 24” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్‌కి వెళ్లింది. మైథాలాజీకల్ థ్రిల్లర్‌గా.. చైతూ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం.. తండేల్తో వంద కోట్ల హీరోగా మారిన నాగ చైతన్య 200 మార్కెట్ కొల్లగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇదిలా ఉంటే NC 24 సెట్స్‌పై ఉండగానే నాగ చైతన్య మరో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. తన మైల్ స్టోన్ మూవీ”NC 25 “..కోసం దర్శకుడు శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడని న్యూస్ వైరల్ అవుతుంది..గతంలో శివ నిర్వాణ నాగ చైతన్య కు మజిలీ వంటి సూపర్ హిట్ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండతో తీసిన ఖుషీ సినిమా యావరేజ్ హిట్ అవ్వడంతో రెండేళ్లుగా మరో ప్రాజెక్ట్ చేయని శివను పిలిచి కలిసి పనిచేద్దామని చైతూ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.అలాగే ఓ కోలీవుడ్ డైరెక్టర్‌తో చైతూ చర్చలు జరుపుతున్నాడట. సర్దార్ ఫేం పీఎస్ మిత్రన్ చైతూను కలిసి స్టోరీ వినిపించినట్లు సమాచారం… కథ నచ్చి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది
