పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ నటించారు. దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ,రాజమౌళి,దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ సర్ప్రైజింగ్ కామియోస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..
కన్నప్ప : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..
అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే నిర్మాత అశ్వినీ దత్ కీలక వ్యాఖ్యలు చేయగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..
“ప్రస్తుతం కల్కి పార్ట్ 2 స్క్రిప్ట్ పూర్తయింది. ఇక ప్రభాస్ షూటింగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.ప్రభాస్ డేట్స్ తో పాటు మిగిలిన స్టార్స్ డేట్స్ సెట్టయితే మూవీ పూర్తి చేయడానికి ఎంతో టైం తీసుకోదు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రాన్ని 2026 ఎండింగ్‌లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం అని నాగ్ అశ్విన్ తెలిపారు..