MOVIE NEWS

కల్కి 2 కంటే ముందుగా అలాంటి సినిమా చేయబోతున్న నాగ్ అశ్విన్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “ఎవడే సుబ్రహ్మణ్యం“ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన నాగ్ అశ్విన్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా “ మహానటి” అనే ఐకానిక్ మూవీ తెరకెక్కించి తన కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898AD` చిత్రం గత ఏడాది రిలీజ్ అయి భారీ సక్సెస్ అందుకుంది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది..

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్, యంగ్ టైగర్.. భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్..!!

ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ విషయంలో వర్క్ చేస్తున్నట్లు సమాచారం.. కల్కి 2 సినిమా రెండు,మూడు సినిమాలతో సమానంగా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.అయితే గతంలో కల్కి 2 రిలీజ్ విషయంపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.కల్కి 2 సినిమా ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులకు ఊహకందని విధంగా మరో అద్భుతంలా సినిమా ఉంటుందని ఆయన తెలిపారు.ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలు పెడతామని నిర్మాత అశ్వినిదత్ చెప్పినా అది సాధ్యమయ్యేలా లేదు… ప్రస్తుతం ప్రభాస్ నటించిన “రాజాసాబ్” రిలీజ్ కి రెడీ అవుతుంది..

అలాగే ప్రభాస్ `పౌజీ` చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఫౌజీ పూర్తయ్యాక ప్రభాస్ యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ అయిన `స్పిరిట్` ని పట్టాలెక్కిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో `సలార్ -2` మొదలవుతుంది.ఆ తరువాత కల్కి 2 మొదలు పెట్టినా పూర్తి కావడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలని తీయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకు తగ్గ స్టోరీ సిద్దంగా లేదు కానీ…. మంచి లవ్ స్టోరీ రాసి దాన్ని ఆరేడు నెలల్లో తీసి రిలీజ్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం

Related posts

కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

murali

బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!!

murali

పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!!

murali

Leave a Comment