Mythri Mahesh Ram Pothineni : టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ప్రాజెక్టు ఎప్పుడా అని అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది చెప్పినట్టుగానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉండనుంది.
డబల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ నుంచి కొత్త సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ మైత్రీ బ్యానర్‌లో చేస్తున్నట్టు మాత్రం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.
ఇక అదే విషయాన్నీ దసరా పండగ సందర్భంగా, చిత్ర బృందం ప్రకటించారు. రామ్ కెరీర్‌లో ఇది మరొక మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉండే ప్రాజెక్టుగా నిలుస్తుందని చెబుతోంది.
ఈ చిత్రాన్ని ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ని తీసిన మహేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also : హరిహర వీరమల్లు.. విశ్వరూపం ఇది
ఈ సినిమా లో రామ్ సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ స్వతహాగానే అందగాడు ఇప్పుడు దర్శకుడు మహేష్…. రామ్ ని మరింత స్టైలిష్ గా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూయిస్తున్నట్టు చెప్తున్నారు.
కెరీర్ మొదట్లో కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్లు చేసిన రామ్ ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరో అయ్యాడు.
‘ఇస్మార్ట్ శంకర్’, ‘స్కంద’ వంటి సినిమాలతో మాస్ పాత్రల్లో రామ్ తనకంటూ మాస్ లో మాంచి బేస్ ఏర్పరుచుకున్నారు. కానీ ఈసారి మాత్రం రామ్ నుంచి పూర్తిగా ఫన్ జోన్ ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
చాలా కాలంగా మాస్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన రామ్ కు ఈ చిత్రం కత్చితం గా ఒక వెరైటీ ప్రాజెక్టుగా నిలుస్తుందని నిర్మాతలు చెప్తున్నారు.
ఈ ప్రాజెక్టు నవంబర్ లో ప్రారంభం కానున్నది ప్రొడక్షన్ పరంగా మైత్రీ మూవీ మేకర్స్ రేంజ్ కి తగ్గకుండా ఉండనుంది అంటే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది.
Follow us on Instagram