MOVIE NEWS

నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు.. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని స్టోరీ సెలక్షన్ పై మంచి గ్రిప్ ఉండటంతో టాలెంట్ వున్న కొత్త దర్శకులుకి ఆఫర్ ఇస్తూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. తాజాగా నాని నిర్మాతగా వ్యవహరించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘కోర్ట్‌’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని పెయిడ్ ప్రీమియర్స్‌ ప్రదర్శించగా ఇది మంచి ప్రేక్షకాదరణతో హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.అయితే కోర్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!!

కోర్ట్‌’ నచ్చకపోతే తన అప్‌కమింగ్‌ మూవీ ‘హిట్‌ 3’ చూడొద్దని బహిరంగంగా చెప్పారు. తాజాగా కోర్ట్ ప్రీమియర్ చూసిన హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘నా సినిమా సేఫ్‌ ‘కోర్ట్‌’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్‌ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్‌ సినిమా చూడండి” అని పోస్ట్‌ పెట్టారు.

ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్‌ పోస్టర్‌ను కూడా జోడించారు. మిర్చిలో ప్రభాస్‌ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్‌ కొలను షేర్ చేసారు… అంటే ‘కోర్ట్‌’కు హిట్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ‘హిట్‌ 3’ సినిమా సేఫ్‌ అని తన పోస్ట్‌తో వివరించారు.ఇటీవల రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ లో నాని నట విశ్వరూపం చూపించారు. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

Related posts

మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా

filmybowl

SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?

murali

పుష్ప 2 : ఓటీటి రిలీజ్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మేకర్స్..!!

murali

Leave a Comment