న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. కథల ఎంపికలో సైతం నాని ఎంతో వైవిద్యత చూపిస్తున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శౌర్యువ్ తెరకెక్కించిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో నాని సరసన స్టార్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం “హిట్ 3” లో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు నానినే ప్రొడ్యూసర్ కావడం విశేషం..
తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!!
గతంలో వచ్చిన హిట్, హిట్ 2 లకు కూడా నాని ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నానినే పార్ట్ 3 లో హీరోగా నటిస్తున్నాడు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది.. ఇదిలా ఉంటే నానికి గతంలో “దసరా” బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరో మూవీ చేస్తున్నాడు.. “ప్యారడైజ్” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాకు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు..
ఇటీవల దేవర సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.అనిరుద్ గతంలో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, జెర్సీ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు.. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. తాజాగా మూడోసారి అనిరుద్ నాని మూవీకి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..
We are on our hattrick 🙂
This will be Epic.#Paradise is N’Ani’Odela Film Now.
Welcome on board dear @anirudhofficial ♥️ pic.twitter.com/rxlJeX5ol7— Nani (@NameisNani) February 2, 2025