Munnabhai 3 on the way
MOVIE NEWS

మున్నా భాయ్ 3 వచ్చే టైమ్ ఆసన్నమైంది – రాజ్ కుమార్ హిరాని

Munnabhai 3 on the way
Munnabhai 3 on the way

Munnabhai 3 : మున్నాభాయ్ MBBS ఆ తర్వాత వచ్చిన లగే రహో మున్నా భాయ్ ఇండియన్ ఫిల్మ్స్ లిస్ట్ లోనే బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాలు గా గుర్తుండిపోతాయి.

ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న సంజయ్ దత్‌ కు సినిమాల పరంగా మళ్ళీ జన్మనిచ్చిన సినిమా ఇది. రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ‘మున్నాభాయ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

ఆ తర్వాత హిరాని మున్నా భాయ్ కి సీక్వెల్ గా ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘనవిజయం సాధించింది. అదే సినిమా నీ చిరు తెలుగు లో శంకర్ దాదా జిందాబాద్ అని రీమేక్ చేశారు గాని ఆశించిన ఫలితం ఐతే రాలేదు.

ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ తీయాలని హిరాని-సంజు ఎప్పుడో అనుకున్నారు. కానీ అది ఎంతకీ కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు హిరానీ ఇప్పుడు మున్నాభాయ్-3 తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు అని బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ . తన నెస్ట్ సినిమా అదే కావచ్చని ఆయన చూచాయి గా చెప్పినట్టు తెలుస్తుంది.

అంతే కాక ‘మున్నాభాయ్-3’ తో పాటు మరో ఐదు వేర్వేరు స్క్రిప్టుల మీద పని చేసినట్లు హిరాని వెల్లడించడం ఇక్కడ విశేషం.

‘మున్నాభాయ్ చలో అమెరికా’ అనే పేరుతో పార్ట్-3 తీస్తున్నట్లు హిరాని అప్పట్లోనే ప్రకటించారు. కానీ ఆ తర్వాత అది పత్తా లేకుండా పోయింది. ఇప్పుడు మున్నాభాయ్ కి మోక్షం వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో పాటుగా తాను మరో ఐదు స్క్రిప్టుల మీద పని చేశానని.. అవన్నీ కూడా సగం సగమే కంప్లీట్ చేసానని.. ఏదీ పూర్త్ చేయలేదని హిరాని వెల్లడించాడు.

Read Also : ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు మొదలయ్యేది అప్పుడే

ఇప్పుడు ఆ ఐదు స్క్రిప్టుల్లో ముందుగా మున్నాభాయ్ నీ ఎంచుకున్నానని దానినీ పూర్తి చేసే పని లో వున్నా ఆనీ హిరాని తెలిపాడు.

మున్నాభాయ్-3.. తొలి రెండు సినిమాల కంటే చాలా ఉన్నతంగా ఉండాలన్నది తాను పెట్టుకున్న లక్ష్యమని.. ఆ దిశగానే కథని రాస్తున్నట్టు హిరాని చెప్పారు.

మున్నాభాయ్ నీ ఇంకా లేట్ చేస్తే సంజు ఏ మాత్రం ఊపేక్షించడని అందుకే త్వరగా పూర్త్ చేసి సినిమా పట్టాలెక్కిస్తానని తెలిపారు. ఈ సినిమా గురించి త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

చూడాలి మున్నాభాయ్ పార్ట్ 3 ఎప్పుడు వచిద్దో. మరల ఆ చిత్రాన్ని తెలుగు లో చిరంజీవి రీమేక్ చేస్తారేమో. ఎందుకంటే శంకర్ దాదా కి తెలుగు లో మం హై ఫ్యాన్స్ ఏ వున్నారు.

Follow us on Instagram 

Related posts

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

murali

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

murali

ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

filmybowl

Leave a Comment