టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. గతంలో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టేవి.. చిరంజీవి సినిమా వచ్చిందంటే ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే.. థియేటర్స్ లో ఫ్యాన్స్ హడావుడి కూడా అదే రేంజ్ లో ఉండేది.. కానీ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినాక తన రేంజ్ మూవీ ఒక్కటి కూడా పడలేదు.. బాస్ ఎనర్జీ మ్యాచ్ చేసే కథ ఒక్కటి కూడా రాలేదు.. దీనితో మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్నారు..యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సరికొత్త స్టోరీ లను ఓకే చేస్తున్నారు..ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “ విశ్వంభర”.ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో వుంది..దీని తరువాత చిరంజీవి లైనప్ లో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అనీల్ రావిపుడి వంటి యంగ్ డైరెక్టర్స్‌తో వరుస సినిమాలు వున్నాయి.
ఊసే లేని ‘విశ్వంభర’.. వశిష్ఠ అప్డేట్ ఎక్కడ..?
దర్శకుడు అనిల్‌తో ఎంటర్టైనింగ్ మూవీ చేస్తున్న మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల తో బిగ్ వైలెంట్ మూవీ చేస్తున్నాడు… పైగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తుండటం మరో విశేషం.అయితే తాజాగా ఈ మూవీ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని ఒక అభిప్రాయానికి వచ్చేశాం. కానీ ఆయన అంతకు మించి.చిరుని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా చూస్తాం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైనో ఫోకస్ చేస్తున్నాం.
ఇప్పుడు శ్రీకాంత్ తో చేసే సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది నిజంగా నాకు ఓ గర్వకారణం. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారిని పెట్టి ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇది కుదిరడం నా అదృష్టం. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ది బెస్ట్ ఇస్తాం అని ఫ్యాన్స్ అస్సలు నిరుత్సాహపరచమని నాని హామీ ఇచ్చారు..