MOVIE NEWS

మెగాస్టార్ కల్ట్ క్లాసిక్.. ఆ రికార్డు బ్రేక్ చేస్తుందా..?

టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎప్పటి నుంచో కొనసాగుతుంది..అయితే ఈ మధ్య రీ రిలీజులకు పెద్దగా ఆదరణ లభించడం లేదు.. రీ రిలీజ్ అంటే చిరంజీవి, బాలయ్య వంటి స్టార్స్ నటించిన ముప్పై నలభై సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలను కూడా మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.. అయితే ఆ మూవీస్ థియేటర్ లో చూసేందుకు వింటేజ్ ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు కానీ ఇప్పటి ట్రెండీ మూవీ లవర్స్ మాత్రం క్లాసిక్ లవ్ స్టోరీస్ కోసం ఎదురు చూస్తున్నారు.అందుకే బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమాకు ఎంత మంచి ప్రమోషన్లు చేసినా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు.

దేవర 2 : బిగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..?

ఈ నేపథ్యంలో తాజాగా రీ రిలీజ్ కి సిద్దమైన జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ప్రశ్నగా మారింది… అయితే మెల్లగా ఈ వింటేజ్ క్లాసిక్ బుక్ మై షో ట్రెండ్స్ లోకి వచ్చేసింది. గత ఇరవై నాలుగు గంటల్లో 6 వేల దాకా టికెట్లు అమ్ముడుపోయినట్లు చూపిస్తోంది.ఇది మరీ పెద్ద నెంబర్ కాకపోయినా వైజయంతి మూవీస్ చేస్తున్న ప్రమోషన్లు భారీ కలెక్షన్ కి దోహదం చేస్తున్నాయి. క్రమం తప్పకుండ ప్రోమోలు వదలడం, కౌంట్ డౌన్ పోస్టర్లు, చిరంజీవి రాఘవేంద్రరావుతో సుమ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ, రీ స్టోరేషన్ కోసం టీమ్ పడిన కష్టాలతో కూడిన ఒక వీడియో బాగా వైరల్ అయింది…

1990 మే 9 రిలీజైన జగదేకవీరుడు అతిలోకసుందరి సరిగ్గా ముప్పై అయిదు సంవత్సరాల తర్వాత తిరిగి అదే డేట్ కి విడుదల కానుండటం అభిమానులకు స్పెషల్ మెమరీ అవుతోంది.హైదరాబాద్ లో సుదర్శన్, భ్రమరాంబ తదితర సింగల్ స్క్రీన్ల మార్నింగ్ షోలు ఆల్రెడీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రసాద్ పిసిఎక్స్ స్క్రీన్లో నాలుగు 3డి షోలు వేస్తే ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తోంది. పలు చోట్ల స్టాండీస్ పెట్టి వాటి ముందు జనాలు ఫోటోలు తీసుకుని జ్ఞాపకంగా ఉంచుకునేలా చేసిన ఏర్పాట్లు సోషల్ మీడియాలో ఈ సినిమా పై పబ్లిసిటీ తీసుకొస్తున్నాయి

Related posts

ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!!

murali

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!!

murali

Leave a Comment