టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఈ దర్శకుడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ అండ్ వైల్డ్ తెలుగు సినిమా చరిత్రలోనే తెరకెక్కలేదు.. తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కించాడు..ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు.. అర్జున్ రెడ్డి సినిమా ప్రతీ ఇండస్ట్రీ లో రీమేక్ అయింది..
ఈ బ్లాక్ బస్టర్ మూవీని సందీప్ హిందీలో రీమేక్ చేయడం విశేషం.. “కబీర్ సింగ్ “ అనే పేరుతో వచ్చిన ఆ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు.. ఆ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఇక గత ఏడాది బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో సందీప్ తెరకెక్కించిన “ యానిమల్ “ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రణ్ బీర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి ఏకంగా 900కోట్ల కలెక్షన్స్ సాధించింది.. 3 గంటలకు పైగా వుండే ఈ సినిమాను సందీప్ వంగా ఎంతో వైల్డ్ గా తెరకెక్కించాడు.. ఈ సినిమా స్టోరీ కలెక్షన్స్ తో పాటు వివాదాలు కూడా తెచ్చిపెట్టింది.. అంత వైలెంట్ గా సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ గా “ యానిమల్ పార్క్ “ అనే సినిమా తెరకెక్కబోతుంది..
బన్నీ నేషనల్ అవార్డు పై సరికొత్త రచ్చ.. అసలు ఏం జరుగుతుంది..?
ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో “స్పిరిట్” అనే సినిమా చేస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాడు… అయితే రీసెంట్ గా సందీప్ రెడ్డివంగా చిరంజీవికి ఒక కథను చెప్పారట.ఆ కథ మరీ వైల్డ్ గా ఉండడంతో చిరంజీవి ఒక్కసారిగా షాక్ అయిపోయారని సమాచారం.మరి ఈ రేంజ్ కథ వద్దు కానీ కొంచెం డోస్ తగ్గించి తీసుకోని రమ్మని చెప్పినట్లు సమాచారం.సందీప్ రెడ్డి వైల్డ్ కథకి చిరంజీవే భయపడ్డారంటే ఆ కథ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు