MOVIE NEWS

చరణ్ కు మెగాస్టార్, ఎన్టీఆర్ స్పెషల్ బర్త్డే విషెస్..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మెగాస్టార్‌ చిరంజీవి తనయుడుగా రామ్‌చరణ్‌ చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతోనే మాస్ హిట్ అందుకున్న చరణ్ తన రెండో సినిమాను దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాడు.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ’మగధీర’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాతో రాంచరణ్ స్టార్ హీరోగా మారాడు.. ఆ తరువాత వరుసగా మాస్ సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాడు..

‘పెద్ది’ గా వస్తున్న రాంచరణ్.. ఊర మాస్ లుక్ అదిరిందిగా..!!

రంగస్థలం సినిమాతో తనలోని నటన చాతుర్యాన్ని మరో ఆవిష్కరించాడు.. ఆ సినిమా రాంచరణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ వైడ్ భారీ సక్సెస్ సాధించింది.. ఈ సినిమా భారీ హిట్ కావడంతో రాంచరణ్ కి గ్లోబల్ వైడ్ మంచి మార్కెట్ ఏర్పడింది.. రాంచరణ్ ఇటీవల నటించిన “గేమ్ ఛేంజర్” ప్లాప్ అయినా కానీ రాంచరణ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..

ఇదిలా ఉంటే నేడు రాంచరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చరణ్ కు శుభాకాంక్షలు చెప్పారు. చరణ్‌ కు అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా విషెష్‌ తెలిపారు.చరణ్ బర్త్డే సందర్భంగా తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.. ఫస్ట్ లుక్ చూసిన మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసారు.. ‘నా ప్రియమైన రామ్‌ చరణ్‌కు హ్యాపీ బర్త్‌డే.. ‘పెద్ది’ ఫస్ట్‌ లుక్‌ చాలా బాగుంది. నటుడిగా మరో కొత్త కోణం తెరపైకి రానుంది. సినిమా ప్రేమికులు, అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేసారు..అలాగే హీరో ఎన్టీఆర్ కూడా చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.నా ప్రియమైన సోదరుడు రామ్‌ చరణ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని.. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్‌ ట్వీట్ చేసారు..

 

Related posts

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

murali

సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

filmybowl

Leave a Comment