Megastar Chiranjeevi coming up with social message film
MOVIE NEWS

సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ??

Megastar Chiranjeevi coming up with social message film
Megastar Chiranjeevi coming up with social message film

Megastar Chiranjeevi message film : అతనొక స్టార్ హీరో. డైలాగ్స్ తో మెప్పించగలడు, డ్యాన్స్ తో మెస్మిరైజ్ చేయగలడు, కామెడీ తో నవ్వించను గలడు. అదే టైం లో సమాజం కోసం మంచి చెప్పగలడు. ఐతే ఈ సారి ఆ చివరిది చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరా హీరో, ఎంటా కథా అనుకుంటున్నారా. సరే చదవండి

‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత చిరంజీవి చేయబోయే చిత్రం ఏది? ఎవ‌రితో అనే విష‌యంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ‘విశ్వంభ‌ర‌’ ముందు చెప్పిన డేట్ అయిన సంక్రాంతికి వచ్చి వుంటే, ఈపాటికి చిరు తన త‌దుప‌రి సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చేది.

కానీ తనయుడు చరణ్ సినిమా కోసం చిరు జ‌న‌వ‌రి నుంచి వేస‌వికి వాయిదా వేసుకోడంతో, చిరు ఇప్పుడు కాస్త రిలాక్డ్స్ గానే ఉన్నారు కొత్త కథలు వినాలని చూస్తున్నారు. ఈలోగా ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. చిరంజీవి నుంచి ఓ గ్రీన్ సిగ్న‌ల్ తెచ్చుకొని, సినిమా మొద‌లెట్టాల‌న్న ఆత్రుతగా ఉన్నారు.

ర‌చ‌యిత బీవీఎస్ ర‌వి కూడా చిరంజీవికి ఓ క‌థ చెప్పారట. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న కాదు. చిరు నీ గాడ్ ఫాదర్ గా ఛూయించిన మోహ‌న్ రాజాతో క‌లిసి ఆయ‌న వ‌ర్క్ చేస్తున్నారు. క‌థ దాదాపుగా తయారయింది.

చిరు సరే అన్నాడంటే ఇక స్టార్ట్ కెమెరా అనడమే. ఈ కథ బీవీఎస్ ర‌వి ఓ సామాజిక సందేశం నిండిన క‌థ రాశార‌ట‌. ‘ఠాగూర్‌’ త‌ర‌హా సినిమా అని, బ‌ల‌మైన సోషల్ మెసేజీతో పాటు, క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నీ అద్దారని స‌మాచారం.

Also Read : గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

ఇదే విష‌యంపై ర‌వి కూడా ఓ మాట అన్నారు. చిరంజీవి అంటే ఎప్పుడు పాట‌లు డాన్సులు గుర్తొస్తాయ‌ని, అలాంటి సినిమాలు ఆయ‌న ఎన్నో చేశార‌ని, ఓ పెద్ద స్టార్ బ‌ల‌మైన సందేశాన్ని ఇస్తే, చాలామందికి దగ్గర అవుతుంద‌ని, ఇప్పుడు అలాంటి క‌థే సిద్ధం చేశాన‌ని చెప్పుకొచ్చారు బీవీఎస్ ర‌వి. ‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత త‌మ సినిమానే మొద‌ల‌వుతుంద‌ని కూడా డిక్లేర్ చేశారు.

అయితే… చిరు టీం మాత్రం ‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత ఏ సినిమా చేయాల‌న్న విష‌యంలో చిరు ఇంకా ఓ నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెబుతున్నారు. బీవీఎస్ ర‌వి క‌థ కూడా ఆప్షన్ లో పెట్టుకున్నారని చెప్పారు, అయితే చిరు ఆమోద ముద్ర వేయాల‌ని అంటున్నారు.

Follow us on Instagram 

Related posts

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!!

murali

గేమ్ ఛేంజర్ : భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ డైరెక్టర్స్..!!

murali

Leave a Comment