మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది.అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ : ఆ రెండు ట్విస్టులతో ప్రేక్షకులు స్టన్ అవ్వడం గ్యారెంటీ..!!
ఇక ఈ సినిమా తర్వాత దసరా సినిమాతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి చిరు రెడీ అవుతున్నారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఈ సినిమా ఊరమాస్‌గా ఉండబోతోంది.చిరంజీవి నెక్స్ట్ లైనప్‌లో మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిరుతో అనిల్ సినిమా సంక్రాంతి కానుకగా అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.. కొంతమంది సినీ ప్రముఖుల సమక్షంలో జనవరి 15న పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది..
షైన్‌స్క్రీన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..మెగాస్టార్ నటించిన విశ్వంభర ఈ సమ్మర్ కి కూడా రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తుంది.. ఇప్పటికే విశ్వంభర టీజర్ గ్రాఫిక్స్ కి ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు మేకర్స్ గ్రాఫిక్స్ టీం ని చేంజ్ చేసారు.. ఈ వర్క్ మొత్తం సరికొత్త టీం కి అప్పజెప్పారు.. దీనితో ఈ సినిమా దసరా కు విడుదలయ్యే ఛాన్స్ వుంది…