MOVIE NEWS

ప్రభాస్ “స్పిరిట్” మూవీలో మెగా హీరో.. వంగా మావ ప్లాన్ అదిరిందిగా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. గత ఏడాది కల్కి సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా వున్నాడు.. మారుతీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లో  గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమా తరువాత ప్రభాస్ హనురాఘవపూడి డైరెక్షన్లో “ ఫౌజీ “ అనే మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది.

ఓజి : ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలే..?

ఇక ఈ సినిమాలతో పాటు “యానిమల్” ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “స్పిరిట్” అనే పవర్ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇప్పటికే సందీప్ రెడ్డి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు.. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తుంది.ఇక ఈ కథకు అనుగుణంగా నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలుపెట్టారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించడం కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ను తీసుకోవాలనే ఆలోచనలో సందీప్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.ఇక ఈ సినిమాలో నటించడానికి వరుణ్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది..ప్రభాస్ ఈ సినిమాలో పవర్ఫుల్ “కాప్” గా కనిపించునున్నాడు..

Related posts

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

murali

నితిన్ మల్టీస్టారర్ మూవీ.. ఇంకో హీరో ఎవరో తెలుసా ?

filmybowl

ఇదెక్కడి మాస్ రా మావ.. డాకూ మహారాజ్ ఎఫెక్ట్.. థియేటర్ స్పీకర్ బద్దలు..!!

murali

Leave a Comment