MOVIE NEWS

Mega 157: రఫ్ఫాడించే ప్రోమో అదిరిపోయిందిగా..!!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అనిల్ మంచి ఫామ్ లో వున్నాడు.. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు.ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ కాంబినేషన్ మూవీ.. ఎట్టకేలకు ఈ ఉగాది సందర్బంగా  ప్రారంభం అయింది..

పెద్ది : చరణ్ మూవీ కోసం దేవిశ్రీ సాయం..?

నూతన తెలుగు సంవత్సరాన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.తాజాగా ఈ సినిమాకు పని చేయబోతున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాయ్స్ తో పాటు అడిషనల్ డైలాగ్ రైటర్స్, కో రైటర్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, డీవోపీ సమీర్, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలను మెగా స్టార్ కు పరిచయం చేస్తూ అనిల్ రావిపూడి ఓ స్పెషల్ వీడియో విడుదల చేసాడు. చివరిగా ఈ సారి రఫ్ఫాడించేద్దాం అనే డైలాగ్ తో అనిల్ రావిపూడి,చిరుతో కలిసి సిగ్నేచర్ స్టెప్ వేసాడు..

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.చిరు వింటేజ్ క్యారెక్టర్స్ తో మొదలైన ఈ ప్రోమో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియజేసింది.. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్ బైనర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శర వేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

Related posts

స్పీడ్ పెంచాం.. రఫ్ఫాడిద్దాం.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ట్వీట్..!!

murali

భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!!

murali

రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఇచ్చిన సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్

filmybowl

Leave a Comment